NTV Telugu Site icon

Woman Tried To Open Plane Door: “ఏసు ప్రభువు” చెప్పాడని.. 37 వేల అడుగుల ఎత్తులో విమానం డోర్ తెరిచే ప్రయత్నం

Usa Flight Incident

Usa Flight Incident

Woman Tried To Open Plane Door At 37,000 Feet Because “Jesus Told Her”: మతం మానవాళి మంచికోసం ఏర్పరుచున్నాం. కానీ అదే మతం తలకెక్కితే ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. తమ మతమే గొప్పదని, దేవుడు తమకు చెప్పాడని చెబుతూ అనాలోచిత పనులకు పాల్పడుతున్నారు కొంతమంది వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఏకంగా విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను రిస్క్ లో పడేసింది. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఓ విమానం ఓ యువతి ప్రవర్తన కారణంగా అత్యవసర ల్యాండింగ్ కావాల్సి వచ్చింది.

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఏసు ప్రభువు చెప్పాడని చెబుతూ ఏకంగా గాలిలో విమానం డోర్లను తెరిచే ప్రయత్నం చేసింది. తోటి ప్రయాణికులు వారించినా.. వినకుండా వారిపై కూడా దాడి చేసింది. ఆ సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ఉంది. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. 34 ఏళ్ల ఎలోమ్ అగ్బె్గ్నినౌ.. విమానం తలుపులు తెరవమని తనకు జీసస్ చెప్పాడు అని చెబుతూ ఇలా ప్రవర్తించింది. ఈ సంఘటన శనివారం టెక్సాస్ లోని హ్యూస్టన్ నుంచి కొలంబస్, ఒహియోకి వెళ్లే సౌత్ వెస్ట్ ఫ్లైట్ 192లో జరిగింది.

Read Also: Measles Outbreak: మహారాష్ట్రలో మీజిల్స్ విజృంభణ.. 700 దాటిన కేసుల సంఖ్య

ఫ్లైట్ అటెండెంట్స్ ఆమెను ఎమర్జెన్సీ ఎగ్జిట్ చేరుకోకుండా అడ్డుకున్నారు. దీంతో సదరు యువతి ప్రవర్తనపై తోటి ప్రయాణికులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అడ్డుకున్న ప్రయాణికులపై ఆమె దాడి చేసింది. ఓ ప్రయాణికుడి తొడను కొరికింది. ముందుగా విమానం వెనకకు వెళ్లిన అగ్బె్గ్నినౌ తదేకంగా ఎగ్జిట్ డోర్ వైపు చూసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్లైట్ అటెండెంట్ ఆమెను కూర్చోవాల్సిందిగా కోరారు. అయితే ఆ సమయంలో ఫ్లైట్ అటెండెంట్ వారిస్తున్నా వినకుండా ఆమె డోర్ హ్యాండిల్ లాగేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటన అనంతరం మహిళ తన తలను విమానం ఫ్లోర్ కు కొట్టుకోవడం ప్రారంభించింది. చివరకు విమానాన్ని లిటిల్ రాక్ లోని బిల్-హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో ‘‘ ఏసు తనను ఒహియోకు వెళ్లమని చెప్పాడని..విమానం తలుపు తెరవాలని చెప్పాడని’’ మహిళ చెప్పింది. తన భర్తకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయానని.. మేరీల్యాండ్ లోని కుటుంబ సభ్యులను వెళ్లాలని భావిస్తున్నట్లు పోలీసులు మహిళ వెల్లడించింది.

Show comments