NTV Telugu Site icon

Viral Video: జస్ట్ మిస్.. కాస్తయితే సొరచేపకు బ్రేక్‌ఫాస్ట్ అయ్యేది..

Viral Video

Viral Video

Viral Video: భూమి మీద ఇంకా నూకలు ఉండి ఉంటాయి.. కొద్ది క్షణాలు ముందుగా నీటిలోకి దూకితే సొరచేపకు ఆహారం అయ్యేది. స్కూబా డైవింగ్ చేద్ధాం అనుకున్న యువతి, సముద్రంలోకి దూకేందుకు సిద్ధం అవుతున్న సమయంలో సొరచేప నోరు తెరుచుని రెడీగా ఉంది. అయితే ఇది గుర్తించిన మహిళ చివరి క్షణంలో నీటిలోకి దూకకుండా, పడవలోనే ఉండిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. స్కూబా సూట్ తో సిద్ధమైన యువతి, సముద్రం నీటిలో దూకేందుకు పొజీషన్ తీసుకుంది. అయితే చివరి క్షణంలో నీటిలో ఏదో ఉన్నట్లు గుర్తించి, నీటిలో దూకకుండా మళ్లీ పడవపైకి ఎక్కుతుండటం వీడియో చూడవచ్చు. క్షణాల వ్యవధిలో షార్క్ నోరు తెరుచుకుని నీటి నుంచి పైకి రావడం ఇందులో కనిపిస్తోంది.

READ ALSO: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్‌ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం

కేవలం కొన్ని మీటర్ల దూరంలో మృత్యువును దగ్గరగా చూడటం సదరు మహిళ వంతైంది. ఒళ్లుగగుర్పాటుకు గురి చేసిన ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ల మంది చూశారు. ఇటీవల కాలంలో సొరచేపల దాడుల వల్ల పలువురు మరణించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో షార్క్ ఎటాక్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఘటనలో మాత్రం మహిళకు ఇంకా అదృష్టం ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ రెడీ అంటూ ఓ నెటిజన్ల కామెంట్ చేయగా.. సొరచేప కిస్ ఇచ్చేందుకు ప్రయత్నించిందంటూ మరోకరు కామెంట్ చేశారు.

Show comments