NTV Telugu Site icon

Snake House: అది ఇల్లు కాదు.. పాముల పుట్ట.. కష్టపడి ఇల్లు కొనుగోలు చేస్తే..

Snakes In Walls

Snakes In Walls

Woman Found Snakes In Walls Of New Home In Colarado: పాపం ఆ మహిళ.. సొంతిల్లు కొనాలన్న లక్ష్యంతో పదేళ్లు కష్టపడింది. తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ, తన ఖర్చులను తగ్గించుకొని పైసా పైసా కూడబెట్టింది. చివరికి తాను కలగన్న తరహాలోనే ఒక మంచి ఇల్లు దొరికింది. దీంతో.. మరో ఆలోచన చేయకుండా, తాను కూడబెట్టిన డబ్బులతో ఆ ఇంటిని కొనుగోలు చేసింది. తీరా ఇంట్లోకి అడుగుపెట్టాక అసలు విషయం తెలిసింది. అది ఇల్లు కాదు, పాముల పుట్ట అని! ఏ గోడ తవ్వినా, ఏ మూల చూసినా.. పాములే పాములు. ఈ ఘటన అమెరికాలోని కొలరాడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Health Tips : నిద్ర లేకుండా మనిషి ఎంతకాలం జీవించగలడు?

ఆ మహిళ పేరు అంబర్‌ హాల్‌. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త లేడు. సింగిల్ మదర్ కావడంతో.. తన ఖర్చులన్నీ తగ్గించుకుని, ఓ ఇల్లు కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. నాలుగు బెడ్‌ రూంలు, ఓ చిన్న లాన్‌, అవసరాలకు తగ్గ కొంత చోటు. ఇలాంటి ఇంటి కోసం గాలించగా.. చివరికి ఒక ఇల్లు దొరికింది. ఇంకేముంది.. ఎక్కువ వివరాలు శోధించకుండానే, ఏప్రిల్‌లో డబ్బంతా కట్టేసింది. వారం రోజుల కిందటే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యింది. లగేజీ మొత్తం తీసుకొచ్చి, ఇంట్లో సర్దడం మొదలుపెట్టింది. అయితే.. ఆమె రెండు కుక్కల్ని లాబ్రాడార్ కుక్కల్ని కూడా పోషిస్తోంది. ఆ కుక్కలు మొరగడంతో, ఏమైందా అని అంబర్ హాల్ క్షణ్ణంగా పరిశీలించింది. అప్పుడు ఆమెకు ఒక పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే, మరికొన్ని పాములు కనిపించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాములన్నీ గోడల్లో దాక్కున్నాయి.

Nurse Football: నర్సు నిర్వాకం.. బ్లడ్ శాంపిల్ తీసుకునే టైంలో..

అన్నేసి పాములు కనిపించడంతో భయపడ్డ అంబర్ హాల్.. స్నేక్ క్యాచర్లను పిలిపించింది. వాళ్లు ఆ ఇళ్లంతా శోధించి, 30కి పైగా పాముల్ని బయటకు తీశారు. ఆ దెబ్బకు ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. ఎంతో కష్టపడి ఇల్లు కొంటే, అదేమో పాముల పుట్టగా తేలింది కదరా బాబూ అంటూ ఆమె మొరపెట్టుకుంటోంది. ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంటుందని సమాచారం. అయినా.. ఆ ఇంట్లో ఇన్ని పాములు రావడానికి కారణం, గతంలో అక్కడ ఓ చిన్నపాటి మడుగు ఉండటమే. అక్కడ బోలెడన్ని పాములు ఉండేవి. ఆ పాములు ఈ ఇంటికి వరుస కట్టాయని తెలుస్తోంది. మరో చోటుకి వెళ్లడానికి డబ్బులు లేక, భయంభయంగా ఆ ఇంట్లోనే ఉంటోంది అంబర్ హాల్. తనని సాయం చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలని కోరుతోంది.