NTV Telugu Site icon

Mike Tyson: మైక్ టైసన్ ఓ క్లబ్‌లో నాపై అత్యాచారం చేశాడు.. న్యూయార్క్ మహిళ దావా

Mike Tyson Case

Mike Tyson Case

Woman files suit accusing Mike Tyson of Molesting in 1990: ప్రపంచ మాజీ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. 1990 మొదట్లో న్యూయార్క్ ఆల్బనీలోని ఓ నైట్ క్లబ్‌లో అతడు తనపై అత్యాచారం చేశాడని.. అప్పటినుంచి తాను శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని తెలిపింది. ఇందుకు తనకు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోరుతూ న్యూయార్క్ న్యాయస్థానంలో ఆమె దావా వేసింది.

BRS : మరోసారి బయటపడ్డ జగిత్యాల బీఆర్‌ఎస్‌లోని విభేదాలు

‘‘మొదట్లో మైక్ టైసన్ నాకు ఆల్బనీలోని ఓ నైట్ క్లబ్‌లో పరిచయం అయ్యాడు. మాటలు కలిసిన అనంతరం తన లిమోసిన్ కారులోకి తీసుకెళ్లాడు. కారులో వెళ్లిన వెంటనే మైక్ టైసన్ నన్ను తాకడం, ముద్దాడడం మొదలుపెట్టాడు. నేను ఎన్నిసార్లు నివారించినా అతడు వదిలిపెట్టలేదు. ఆ తర్వాత బలవంతంగా నా ప్యాంట్ విప్పి, నాపై హింసాత్మకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన తర్వాత నేను శారారీకంగా, మానసికంగా చాలా కుంగిపోయాను. చాలారోజుల పాటు ఆ ఘటన నుంచి తేరుకోలేకపోయా. ఇందుకు గాను నాకు 5 మిలియన్ డాలర్లు ఇప్పించండి’’ అంటూ ఆ మహిళ తన దావాలో పేర్కొంది. అయితే.. తన అఫిడవిట్‌లో ఆమె 1990 ప్రారంభంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది కానీ, ఏ రోజు జరిగిందన్న తేదీని మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు.. తనకు సంబంధించిన వివరాలని గోప్యంగానే ఉంచాలని, ఒకవేళ తన ప్రచురిస్తే తానింకా మానసికంగా కుంగిపోతానని ఆవేదన వ్యక్తం చేసింది.

India-China Border: భారత్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. 26 గస్తీ పాయింట్లు కోల్పోయామన్న అధికారి

ఆ మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. కేవలం ఆమె ఆరోపణలతో ఈ దావా వేయలేదని, ఆమె ఆరోపణల్ని పరిశోధించి, అత్యంత విశ్వసనీయమైనవిగా నిర్ధారించుకొని ఇలా దావా వేయడం జరిగిందని పేర్కొన్నారు. కాగా.. మైక్ టైసన్ 1987 నుంచి 1990 వరకు ప్రపంచ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌గా కొనసాగాడు. రింగ్‌లో అతడు ఎంత సక్సెస్‌ఫులో.. రింగ్ బయట అంతే వివాదాలు అతడ్ని చుట్టుముట్టాయి. 1980 చివర్లో నటి రాబిన్‌ గీవెన్స్‌ను పెళ్లాడిన ఆయన.. కొద్దికాలానికే విడాకులు తీసుకున్నాడు. ఆ సమయంలో తమ దాంపత్య జీవితం హింస, వినాశనంతో కొనసాగిందని గీవెన్స్ పేర్కొన్నారు. ఆ కొద్దికాలానికే.. దేసిరీ వాషింగ్టన్‌ అనే మోడల్‌ మైక్‌ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో ఆయన మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాడు.