Site icon NTV Telugu

క‌రోనా టీకా తీసుకున్న తొలి పురుషుడు మృతి… 

2020 డిసెంబ‌ర్ నుంచి ప్ర‌పంచంలో క‌రోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.  తొలిటీకాల‌ను బ్రిట‌న్‌లో వేశారు.  60 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ అందించారు.  తొలి టీకా వేయించుకున్న తొలి మ‌హిళగా 91 ఏళ్ల మార్గ‌రేట్ కీన‌న్ చ‌రిత్ర సృష్టించ‌గా, తొలి పురుషుడిగా 81ఏళ్ల విలియం షెక్స్ పియ‌ర్ చ‌రిత్ర సృష్టించారు.  అయితే, తొలి టీకా వేసుకున్న విలియం అనారోగ్యంతో మృతి చెందారు.  టీకాకు విలియం మృతికి సంబందం లేద‌ని, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న ఆయ‌న మృతి చెందిన‌ట్టు బ్రిట‌న్ మీడియా తెలిపింది.  డిసెంబ‌ర్ 8, 2020న విలియం షెక్స్ పియ‌ర్ టీకా తీసుకున్నారు.  టీకా తీసుకున్న తొలి మ‌హిళ మార్గ‌రేట్ కీన‌న్ ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నార‌ని బ్రిట‌న్ మీడియా పేర్కొన్న‌ది.  

Exit mobile version