NTV Telugu Site icon

Dr Saveera Parkash: “భారత్‌తో సంబంధాలు మెరుగుపరుస్తా”.. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళా..

Hindu Woman

Hindu Woman

Dr Saveera Parkash: డాక్టర్ సవీరా ప్రకాష్ పేరు ఇప్పుడు పాకిస్తాన్ లోనే కాదు ఇండియాలో కూడా ఫేమస్ అయింది. ఫిబ్రవరిలో పాకిస్తాన్ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిందూ మహిళగా సవీరా ప్రకాష్ నిలిచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన పాక్ వంటి దేశంలో ఓ హిందువు అదికూడా ఓ మహిళ ఎన్నికల బరిలో నిలబడటం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Earthquake : ఆఫ్ఘనిస్తాన్‌లో 30నిమిషాల్లో రెండుసార్లు భూకంపం.. వణికిన మణిపూర్, బెంగాల్

ఆమె ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని బునెర్ నియోజవర్గం నుంచి సవీరా ప్రకాష్ పోటీ చేస్తున్నారు. తాను ఎన్నికైతే భారత్-పాక్ మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణలో సహాయం చేస్తానని ఆమె చెప్పారు. వృత్తిరీత్యా వైద్యురాలైన 25 ఏళ్ల సవీరా.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నుంచి గత వారం నామినేషన్ దాఖలు చేశారు. ముస్లిం సోదరులు కూడా తన గెలుపుకు సహకరించాలని, వారి మద్దతు పొందానని, తాను ‘డాటర్ ఆఫ్ బునెర్’ అనే బిరుదును పొందానని సవీరా అక్కడి మీడియాకు మంగళవారం నివేదించారు.

తాను గెలిస్తే, పాకిస్తాన్ లోని హిందువుల సమస్యలను పరిష్కరించడానికి తాను సాయం చేస్తానని ఆమె చెప్పారు. తాను దేశభక్తి గల హిందువునని అన్నారు. న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య సంబంధాల విషయంలో తాను సానుకూల పాత్ర పోషిస్తానని చెప్పారు. మాజీ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో పార్టీ అయిన పీపీపీ మహిళా విభాగానికి సవీరా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీని నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.