USA President Race: చైనా టార్గెట్ గా అమెరికా అధ్యక్ష ఎన్నిలక ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున భారతీయ అమెరిక నిక్కీహేలీ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. మరోవైపు ఆదే పార్టీ నుంచి వివేక్ రామస్వామి కూడా పోటీలో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరువురు కూడా చైనా టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తాము గెలిస్తే చైనాకు ఎలా బుద్ధి చెబుతామనే విషయాలను వెల్లడిస్తున్నారు.
Read Also: Bandi Sanjay: బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే..
2024లో తాను అమెరికా అధ్యక్షుడిని అయితే చైనాతో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలపై నిషేధం విధిస్తానని వెల్లడించారు. తాను కూడా అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ విధానానికే మద్దతు ఇస్తానని అన్నారు. అమెరికా గుర్తింపు సంక్షోభంలో ఉందని, మనం చైనా నుంచి స్వాతంత్య్రం పొందాల్సి ఉందంటూ మాట్లాడారు. తాను అమెరికా మొదటి సంప్రదాయవాదినని, దేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలపాలని, అమెరికా అంటే ఏమిటో మనం ఇప్పుడు కనుగొనాల్సి ఉందని, అందకే తాను గతవారం అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ప్రకటించానని వెల్లడించారు. మనం చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలనుకెుంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) పడిపోయే వరకు చైనాలో వ్యాపారం చేయకుండా యూఎస్ సంస్థలను నిషేధించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మరో భారతీయ-అమెరికన్ నిక్కీ హేలి కూడా చైనాను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇటీవల చైనీస్ స్పై బెలూన్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసిందని అన్నారు. తాను అధికారంలోకి వస్తే చైనాకు అమెరికా ఇచ్చే నిధులను కట్ చేస్తానని వెల్లడించారు. అమెరికా ఇప్పటి వరకు ఎదుర్కొన్న శతృవుల్లో అత్యంత బలమైన శతృవు చైనానే అని అన్నారు. డ్రగ్స్ మాఫియా కన్నా చైనానే ప్రమాదికారి అని విమర్శించారు.
