Site icon NTV Telugu

కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు…ప్రపంచంలోనే మొదటిసారి…

ఉక్రెయిన్ ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లో యుద్ద‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్‌ను దారిలోకి తెచ్చుకోవాల‌ని ర‌ష్యాచూస్తున్న‌ది. దీని వెనుక చాలా కార‌ణాలు ఉన్నాయి. 2014లో క్రిమియాను ర‌ష్యా ఆక్ర‌మించుకున్న‌ది. సోవియ‌ట్ యూనియ‌న్ స‌మ‌యంలో డెనిప‌ర్ న‌దిద్వారా కెనాల్‌ను ఏర్పాటు చేసి క్రిమియాకు తాగునీటిని అందించేవారు. అంతేకాదు, ర‌ష్యా వైమానిక స్థావ‌రానికి తాగునీటి అవ‌స‌రాల‌కు డెనిప‌ర్ న‌ది నుంచే నీటి స‌ర‌ఫ‌రా అయ్యేది. 2014లో జ‌రిగిన ప‌రిణామాల త‌రువాత ఉక్రెయిన్ డెనిప‌ర్ న‌దిపై ఆన‌క‌ట్ట క‌ట్ట‌డంతో నీటి స‌ర‌ఫ‌రా త‌గ్గిపోయింది. దీంతో క్రిమియా, ర‌ష్యా వైమానిక స్థావ‌రాలకు నీటి స‌ర‌ఫ‌రా కోసం పెద్ద మొత్తంలో ర‌ష్యా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తున్న‌ది.

Read: ఆ వృద్ధుడు యువ‌కుడిగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించి… చివ‌ర‌కు…

ఈ ఖ‌ర్చుల నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే డెనిప‌ర్ న‌దిపై క‌ట్టిన ఆన‌క‌ట్ట‌పై ఆధిప‌త్యం సంపాదించాలి. ర‌ష్యా దీనికోస‌మే ఉక్రెయిన్‌తో లొల్లికి దిగింద‌ని కొంత‌మంది నిపుణులు చెబుతున్నారు. గ‌తంలో నీటికోసం యుద్దాలు జ‌రిగాయి. ఒక‌వేళ ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య యుద్ధం సంభ‌విస్తే ఆధునిక కాలంలో నీటికోసం జరిగే తొలియుద్ధం ఇదే అవుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Exit mobile version