NTV Telugu Site icon

Elon Musk: భారతీయ-అమెరికన్ బిలియనీర్‌కు ఎలాన్ మస్క్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..!

Elonmusk

Elonmusk

ఒక ఫొటో ఇద్దరు కుబేరుల మధ్య వివాదానికి దారిసింది. అందులో ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కాగా.. ఇంకొకరు భారతీయ-అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా. ఒక తప్పుడు ఫొటో కారణంగా సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది. చివరికి క్షమాపణతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అసలు ఇద్దరి మధ్య గొడవకు ఫొటో ఎందుకు కారణమైంది. ఆ ఫొటో ఏంటి? క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Paris Fashion Week: పారిస్ ఫ్యాషన్ వీక్ లో 86 ఏళ్ల నటి ర్యాంప్‌ వాక్..

అమెరికాలోని కాలిఫోర్నియా బీచ్‌లో ఒక చిత్రంతో కూడిన ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిపై ‘‘No PLEBS ALLOWED’’ అని రాసి ఉంది. దాని కిందనే ప్రాపర్టీ ఆఫ్ వినోద్ ఖోస్లా అని ఉంది. ఈ ఫొటోపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. పబ్లిక్ బీచ్‌లో కూడా వినోద్ ఖోస్లా తన సొంత ఆస్తిగా పేర్కొన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలే వివాదానికి దారి తీశాయి. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై వినోద్ ఖోస్లా తీవ్రంగా స్పందించారు. ఒక తప్పుడు చిత్రాన్ని పట్టుకుని వెనక ముందు చూసుకోకుండా విమర్శలు చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఏఐ రూపొందించిన ఒక తప్పుడు చిత్రాన్ని పట్టుకుని విమర్శించడమేంటి? అని నిలదీశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని వినోద్ ఖోస్లా డిమాండ్ చేస్తూ రీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: పద్మశ్రీ మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన ముఖ్యమంత్రి..

వినోద్ ఖోస్లా వివరణతో ఎలాన్ మస్క్ నాలుక కరుచుకున్నారు. తప్పు జరిగిపోయిందని భావించి.. ఎక్స్ ద్వారా ఎలాన్ మస్క్ క్షమాపణ తెలియజేశారు. దయచేసి తనను క్షమించాలని కోరారు.

ఇదిలా ఉంటే త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. కమలా హారిస్‌కు వినోద్ ఖోస్లా మద్దతు తెల్పగా.. ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల డొనాల్డ్ ట్రంప్‌ను మస్క్ చేసిన ఇంటర్వ్యూను వినోద్ ఖోస్లా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.