Monkeypox: మంకీపాక్స్ ప్రమాదకరమైనదేనా?

Monkey

Monkey

కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్‌ మంకీపాక్స్‌. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మంకీపాక్స్​ మరిన్ని దేశాలకు విస్తరించడంపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి?, దాని నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కానీ మంకీపాక్స్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అనే విషయంపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

మంకీపాక్స్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్‌ 23న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ అన్నారు.
అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచాలని నిర్ణయించామన్నారు. ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.