NTV Telugu Site icon

కోవిడ్ చికిత్స‌లో రెమ్‌డెసివర్ వాడొద్దు.. స్ప‌ష్టం చేసిన డ‌బ్ల్యూహెచ్‌వో..

Remdesivir

క‌రోనా స‌మ‌యంలో రెమ్‌డెసివ‌ర్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది… ఈ ఇంజ‌క్ష‌న్‌కు ఫుల్ డిమాండ్ ఏర్ప‌డి.. మార్కెట్‌లో దొర‌క‌ని ప‌రిస్థితి… దీంతో.. కేటుగాళ్లు దీనిని సొమ్ము చేసుకోవ‌డానికి బ్లాక్ మార్కెట్‌కు తెర‌లేపారు.. బాధితుల అవ‌స‌రాన్ని బ‌ట్టి అందిన‌కాడికి దండుకునేపిలో ప‌డ్డారు.. ఇప్ప‌టికే చాలా ముఠాల గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు.. అయితే.. ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయ‌న్న డ‌బ్ల్యూహెచ్‌వో.. ఈ ఇంజ‌క్ష‌న్‌తో కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని కుండ‌బ‌ద్ద‌లుకొట్టింది.. దీంతో.. కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఇలా.. కోవిడ్ చికిత్స నుంచి ఒక్కొక్క‌టి త‌గ్గిపోతున్నాయి.. ఇప్ప‌టికే ఫ్లాస్మా థెర‌పీతో ఉప‌యోగం లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు.. రెమ్‌డెసివ‌ర్‌పై డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌న కీల‌కంగా మారింది.. ఇప్ప‌టికీ రాష్ట్రాల నుంచి ఈ ఇంజ‌క్ష‌న్ల కోసం కేంద్రంపై ఒత్తిడి ఉంది.. మాకు ఇన్ని కావాలి.. మా కోట ఇంత అంటూ.. కేంద్రాన్ని కోరుతున్నాయి రాష్ట్రాలు.. ఈ త‌రుణంలో డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌నకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.