కరోనా సెకండ్ వేవ్ నుంచి ప్రపంంచ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కోవిడ్ వైరస్ మ్యూటేషన్లు టెన్షన్ పెడుతున్నాయి. భారతదేశంలో సెకండ్ వేవ్ కారణమైన బి.1.617.2 వేరియంట్ లేదా వేరియంట్ ప్రపంచదేశాల్లోనూ విస్తరిస్తోంది. ఇప్పటికే బ్రిటన్‌లో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడ మరలా ఆంక్షలు విధించారు. వచ్చె నెల వరకు ఆంక్షలను అమలు చేస్తున్నారు.
Read: “అల వైకుంఠపురంలో” హిందీ రీమేక్ టైటిల్ ఇదే?
వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని వ్యాక్సిన్ తయారీసంస్థలు, ఆయాదేశాలు వెల్లడిస్తున సమయంలో ప్రపంచ ఆరోగ్యసంస్థకు చెందిన అంటువ్యాధుల నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉందని పేర్కొన్నారు. వేరియంట్లను అడ్డుకోవడానికి మరింత ప్రభావవంతమైన వ్యాక్సిన్లు రావాలని పేర్కొన్నారు. ఇట ఐసీఎంఆర్ కూడా ఇలాంటి నివేదిలనే ఇచ్చింది. బి.1.617.2 వేరియంట్లపై వ్యాక్సిన్లు స్వల్పప్రభావాన్ని మాత్రమే చూపుతున్నాయని, అయితే, ఇతర కరోనా వేరియంట్లపై అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు మంచి ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు.
