NTV Telugu Site icon

WHO warns: గాజాలో కరవు విలయతాండవం.. తక్షణమే సాయం పెంచాలంటూ డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్

Who

Who

గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది. కనీస అవసరాలు తీర్చుకోలేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే సాయం పెంచాలంటూ ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: మావారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం..

అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌‌పై హమాస్ దాడికి తెగబడింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లిపోయింది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అప్పటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. చాలా మంది నిరాశ్రయులుగా మారారు. మరికొందరు తరలిపోయారు. అయితే కొంత కాలం స్వచ్ఛంద సంస్థలు సాయం అందించడంతో కడుపు నింపుకున్నారు. అయితే కొంత కాలం నుంచి గాజాకు వెళ్లే దారులు మూసివేయబడ్డాయి. దీంతో సాయం నిలిచిపోయింది. దీంతో గాజాలో మరింత క్షామం పెరిగింది. ఆకలితో అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి పరిస్థితులను చూసి డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే సాయం పెంచాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే శుక్రవారమే గాజాకు వెళ్లే దారిని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది.

ఇది కూడా చదవండి: Thummala Nageswara Rao: రైతు రుణమాఫీపై క్లారిటీ.. అప్పటి లోపు పూర్తిగా మాఫీ

తక్షణమే మానవతా సాయం అందించకపోతే గాజా పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రజలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని.. తక్షణమే ఆహారంతో పాటు ఔషధాలు అందించాలని సూచించింది. మరోవైపు బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన ధరలతో వస్తువులు అమ్ముతున్నారు. దీంతో కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: మావారిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు పోరాటం..