NTV Telugu Site icon

Ralph Paul Yarl Case: పొరపాటున పక్కింటి డోర్‌బెల్ మోగించాడు.. వెంటనే తుపాకీ తీసి..

Ralph Paul Yarl

Ralph Paul Yarl

White Homeowner Accused Of Shooting Black Teen Who Went To The Wrong House In Kansas City: పాపం.. ఓ కుర్రాడు చేసిన చిన్న పొరపాటు అతని ప్రాణాల మీదకే తెచ్చింది. పక్కింటి డోర్‌బెల్ మోగించినందుకు.. ఆ ఇంటి యజమాని ‘ఎవరు, ఏంటి’ అని ఆరా తీయకుండా నేరుగా తుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. దీంతో.. రెండు తూటాలు ఆ కుర్రాడి తలలోకి దూసుకెళ్లాయి. బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇప్పుడు ఆ కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Horrible Femicide: సేద తీరడానికి బీచ్‌కి వెళ్లారు.. దారుణ హత్యకు గురయ్యారు

ఆఫ్రికన్ అమెరికన్ అయిన రాల్ఫ్ పాల్ యార్ల్ అనే 16 ఏళ్ల కుర్రాడు.. తన 11 ఏళ్ల ట్విన్ బ్రదర్స్‌ని స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకోవడం కోసం వెళ్లాడు. అపార్ట్‌మెంట్‌కి చేరుకున్న అతగాడు.. పొరపాటున స్నేహితుడి ఇంటి డోర్‌బెల్ మోగించకుండా, పక్కింటి డోర్‌బెల్ మోగించాడు. డోర్ కూడా రెండు, మూడుసార్లు నాక్ చేశాడు. అంతే.. ఆ ఇంటి యజమాని అయిన ఆండ్రూ లెస్టర్ బోర్ ఓపెన్ చేసి, తుపాకీతో అతనిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. దీంతో.. రెండు తూటాలు ఆ టీనేజర్ తలలోకి దూసుకెళ్లాయి. ఆ దెబ్బకు అక్కడికక్కడే కుప్పకూలిన రాల్ఫ్.. తనని కాపాడాల్సిందిగా గట్టిగా కేకలు వేసి, స్పృహ కోల్పోయాడు. అప్పుడు జేమ్స్ లించ్ అనే స్థానికుడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ కుర్రాడ్ని ఆసుపత్రికి తరలించాడు.

Extramarital Affair: అల్లుడితో లాడ్జ్‌కి వెళ్లిన అత్త.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్

ఈ ఘటనపై లించ్ మాట్లాడుతూ.. డోర్‌బెల్ మోగించినంత మాత్రాన కాల్పులు జరపకూడదని, ఆ కుర్రాడు ఇందుకు అర్హుడు కాదని తెలిపాడు. మొదట్లో ఆ కుర్రాడు చనిపోయాడని తాను అనుకున్నానని, అతడు బ్రతికే ఉన్నాడని తెలిసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లానన్నాడు. ఇప్పుడిప్పుడు ఆ కుర్రాడు జీవతం చూడటం మొదలుపెట్టానన్నాడు. మరోవైపు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గంటల వ్యవధిలోనే విడుదల అయ్యాడు. దీంతో.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని, నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది జాత్యాహంకారంతో జరిగినే ఘటన అని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్లు చేశారు.

Sourav Ganguly: కోహ్లీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి దాదా రియాక్షన్

రాల్ఫ్ అత్త ఫెయిత్‌ స్ఫూన్‌మూర్‌ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉందని, దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ‍ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో.. పోలీసులు దిగొచ్చి, చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్‌(85) అదుపులోకి తీసుకొని, అరెస్టు చేశారు. కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది.