ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనినే థర్మోబారిక్ బాంబ్ అని పిలుస్తారు. ఇది న్యుక్లియర్ బాంబు కాకపోయినా, విధ్వంసం మాత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బాంబు 44 టన్నుల టీఎన్టీ విస్పోటనాన్ని కలిగిస్తుంది.
Read: Ukraine Crisis: చైనా కీలక వ్యాఖ్యలు… సాధ్యం కాదు… అక్కడే ఉండిపోండి…
ఒకసారి ఈ బాంబు పేలితే 300 మీటర్ల పరిధిలో విధ్వంసం జరుగుతుంది. ఈ బాంబును యుద్ధవిమానం నుంచి జారవిడిచిన తరువాత అది లక్ష్యాన్ని చేరుకొని గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకొని నేలను తాకకముందే పేలిపోతుంది. దీని నుంచి వెలువడే భారీ విధ్వంసక శక్తి ఆ ప్రాంతంలోని వారిని మసి చేసేస్తుంది. ఈ బాంబులను ప్రయోగిస్తే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. పుతిన్ ఆ బాంబును వినియోగించేందుకు సేనలకు అనుమతి ఇచ్చారని సమాచారం.