Site icon NTV Telugu

Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి సందేశం

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మధ్యంతర ప్రభుత్వం నుంచి సోమవారం పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని సందేశం పంపించారు. అయితే ప్రజలు ఆగ్రహానికి గురయ్యేలా ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.

బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యూకేలో ఉండాలని రెడీ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో పెండింగ్‌లో పడింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. తిరిగి దేశానికి రావాలని ఆహ్వానం పంపింది.

ఇది కూడా చదవండి: Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం

కోటా ఉద్యమంపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. దీంతో నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు వచ్చేశారు. అయితే ఇక్కడ నుంచి యూకేకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ యూకే ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె భారత్‌లోనే బస కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా తర్వాత నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానంపై షేక్ హసీనా ఎలా స్పందిస్తారో చూడాలి. కొద్దిరోజులు భారత్‌లోనే ఉంటారా? లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్లారా? అన్నది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: AIADMK: జయలలితపై మంత్రి అవమానకర వ్యాఖ్యలు.. అన్నాడీఎంకే మండిపాటు

Exit mobile version