Site icon NTV Telugu

వినూత్న ఆలోచన‌: వాడేసిన మాస్క్‌ల‌తో వెడ్డింగ్ గౌన్‌…

క‌రోనా కాలంలో మాస్క్‌ల వాడకం అధికమయింది.   క‌రోనా త‌రువాత ప్ర‌పంచంలో వాడిపాడేసిన మాస్క్‌లతో కాలుష్య‌మ‌వుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్న నేప‌థ్యంలో టామ్ సిల్వ‌ర్ వుడ్ అనే డిజైన‌ర్ డిస్పోజ‌బుల్ మాస్క్‌ల‌తో తెల్ల‌ని వెడ్డింగ్ గౌన్‌ను త‌యారు చేశారు.  1500 వాడి ప‌డేసిన మాస్క్‌ల‌తో ఈ వెడ్డింగ్ గౌన్‌ను త‌యారు చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  ఈ గౌన్ త‌యారీకి ప్ర‌ముఖ వెడ్డింగ్ ప్లాన‌ర్ సంస్థ హిచ్డ్ ఆర్థిక సహాయం అందించింది.  జెమియా హాంబ్రో అనే మోడ‌ల్ ఈ డ్రెస్‌ను ధ‌రించి లండ‌న్‌లోని సెయింట్ పాల్స్ క్యాథెడ్ర‌ల్ ముందు ఫోజులు ఇచ్చింది.  ఇంగ్లాండ్‌లో ఫ్రీడం డే సంద‌ర్భంగా ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు.  ఇక ఇదిలా ఉంటే, ఒక్క బ్రిట‌న్‌లోనే వారానికి వంద మిలియన్లకు పైగా మాస్క్‌లను వాడి పారేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  

Read: మహేష్ “సరిలేరు నీకెవ్వరు”… హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ !

Exit mobile version