Racist comments: భారత సంతతికి చెందిన మహిళను ఉద్దేశిస్తూ ఇంగ్లాండ్ వ్యక్తి చేసిన ‘‘జాతి విద్వేష వ్యాఖ్యలు’’ వైరల్‌గా మారాయి. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో తప్పతాగి ఉన్న వ్యక్తి భారత్‌తో పాటు ఆ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లండన్ నుంచి మాంచెస్టర్‌కి రైలులో వెళ్తున్న క్రమంలో 26 ఏళ్ల భారత సంతతి మహిళ గాబ్రియెల్ ఫోర్సిత్ జాతివిద్వేషాన్ని ఎదుర్కొన్నారు. వలసదారులకు మద్దతు ఇచ్చే సంస్థ గురించి తోటి ప్రయాణికుడితో మాట్లాడుతున్న సందర్భంలో, మరో ప్రయాణికుడు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసి బెదిరించారు. ఆమె ఆదివారం రోజు తన ఇంటికి రైలులో వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
Read Also: PM Modi Plane Cost: ప్రధాని మోడీ ప్రయాణించే విమానం ధర ఎంతో తెలుసా?
సదరు వ్యక్తి మహిళతో పాటు ఇతర ప్రయాణికులను కూడా ‘‘వలసదారులు’’ అంటూ దుర్భాషలాడాడు. ‘‘ఇంగ్లీష్ వాళ్లు ప్రపంచాన్ని జయించి తిరిగి ఇచ్చారు. మేము భారత్‌ని జయించాము. భారత్‌ని కోరుకోకపోవడంతో మనం వారికే తిరిగి ఇచ్చేశాము’’ అంటూ కామెంట్స్ చేశాడు. అయితే, ఈ ఘటనపై ఫోర్సిత్ స్పందించారు. ‘‘అతను వలసదారు అనే పదాన్ని వాడాడు. ’’ అని చెప్పింది. ఈ ఘటనపై బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులకు నివేదించింది. ‘‘భారతీయురాలిగా ఉండటం, వలస వచ్చిన వ్యక్తికి కుమార్తెగా ఉండటం నా చరిత్ర, నా వారసత్వంతో సంబంధం కలిగి ఉండటం ఒక వరం, బహుమతి. నా ప్రజల కోసం నిలబడుతూనే ఉంటా’’ అని చెప్పింది.