NTV Telugu Site icon

Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..

Giorgia Meloni

Giorgia Meloni

Giorgia Meloni: నాటో సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాటో శిఖరాగ్ర సమావేశం మూడో రోజున అమెరికా ప్రెసిడెంట్ ఆలస్యంగా రావడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. గురువారం ఈ ఫన్నీ సన్నివేశం జరిగింది. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో మెలోని మాట్లాడుతూ..తన కళ్లను తిప్పి, సమయం దాటి పోతుందని గుర్తు చేస్తూ తన వాచ్‌ వైపు చూసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నాటో సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావల్సి ఉన్నా, బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ఉదయం 10.45కి సమావేశాన్ని ప్రారంభించారు. అప్పటి వరకు వివిధ దేశాధినేతలు వీరి కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే సమయం దాటి పోతుందని ఉద్దేశం వచ్చేలా మెలోని తన చేతికి వాచ్ లేకున్నా చేతి వైపు చూసింది. అక్కడే ఉన్న మరో వ్యక్తి మొబైల్ ఫోన్ తీసి టైం ఎంత అవుతుందని చూశారు.

జార్జియా మెలోని, బైడెన్‌లో ఇలాంటి సన్నివేశంలో కలుసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఇటలీ వేదికగా జరిగి జీ-7 సమావేశంలో దేశాధినేతలంతా కలిసి ఫోటోలకు ఫోజ్ ఇస్తున్న సమయంలో, బైడెన్ వేరే వైపు వెళ్లి అక్కడ ఎవరూ లేకున్నా అభివాదం చేస్తారు. వెంటనే మెలోని ఆయనను ఫోటోలు తీస్తున్న వైపు తీసుకువస్తుంది.

Show comments