Vladimir Putin Says Russian Victory In Ukraine Is Guaranteed: ఉక్రెయిన్‌పై దాడి చేసి దాదాపు సంవత్సరం కావొస్తున్న తరుణంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఉక్రెయిన్‌పై కచ్ఛితంగా విజయం సాధించి తీరుతామని ఉద్ఘాటించారు. అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో కాలంలో తమకూ ఎదురుదెబ్బలు తగిలిన వాస్తవమేనని, అయినా సరే రష్యా దళాలు కచ్ఛితంగా విజయం సాధిస్తాయని నమ్మకం వెలిబుచ్చారు. లెనిన్‌గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యా ప్రజల ఐక్యత, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా తమకే గెలుపు దక్కుతుందని విశ్వాసంగా చెప్పారు.
Road Accident: రాయగఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం
ఇదే సమయంలో రష్యా రక్షణ పరిశ్రమపై కూడా పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా.. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగి ఏడాది అవుతున్నా, ఆ దేశాన్ని ఓడించలేకపోయింది. కొన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నట్టే చేసుకొని, ఉక్రెయిన్ బలగాల దాటికి రష్యా సైనికి వెనకడగు వేశారు. దీంతో.. ఆయా ప్రాంతాల్ని ఉక్రెయిన్ తిరిగి తన భూభాగంలో చేర్చుకుంది. రష్యా దాడులకు ప్రతిదాడులతో ఉక్రెయిన్ చాలా సందర్భాల్లో గట్టి సమాధానమే ఇచ్చింది. యూఎస్ సహా ఇతర దేశాల నుంచి కూడా ఉక్రెయిన్‌కి మద్దతు లభిస్తోంది. రానురాను ఇరుదేశాల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాము ఈ యుద్ధంలో తాము గెలుస్తామా? లేదా? దీని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న భయాలో రష్యాలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సమర్థింపు చర్యగా.. పుతిన్ పై వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
Tamannaah Bhatia: తమన్నాతో డేటింగ్.. ఫోటో ప్రూఫ్‌తో విజయ్ క్లారిటీ
మరోవైపు.. అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే, రష్యాకు వ్యతిరేకంగా జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉక్రెయిన్ కొత్త ఆధునిక ఆయుధాల కోసం, ముఖ్యంగా భారీ యుద్ధ ట్యాంకులు కావాలని అభ్యర్థించింది. గత ఫిబ్రవరిలో రష్యా ఆక్రమించిన భూభాగాలను 2022 రెండో భాగంలో తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ జోష్‌తోనే ఉక్రెయిన్ ముందుకెళ్తోంది. రష్యా కొత్త దాడికి సిద్ధమవుతోందని భయపడుతున్నందున ఉక్రెయిన్‌కు ఆధునిక ట్యాంకులు, క్షిపణులను అందించడం చాలా కీలకమని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా బుధవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో అన్నారు. జర్మనీ ఆమోదిస్తే చిరుతపులి ట్యాంకులను పంపిస్తామని పోలాండ్, ఫిన్లాండ్ ఇప్పటికే తెలిపాయి.