Site icon NTV Telugu

Putin: ఉక్రెయిన్‌ వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా

ఉక్రెయిన్‌పై ఏ క్షణాన్నైనా యుద్దానికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది . ఓవైపు అమెరికాతో చర్చలంటూనే, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులతో దాడులు చేయిస్తోంది. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్‌ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే తిప్పికొడతామని హెచ్చరించారు. అంతేనా డోనెట్క్స్‌, లుహాన్స్‌లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తూ, సంతకాలు చేశారు పుతిన్..

Read Also: Maha Shivaratri: శ్రీశైలంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

దీంతో డోనెట్క్స్‌, లుహాన్స్క్‌ రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాణాసంచా కాల్చి అక్కడి తిరుగుబాటు దారులు, పౌరులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. సంబరాలు చేసుకున్నారు. మరోవైపు, రష్యా తీరుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సార్వభౌమత్వం విషయంలో రష్యా ఎలా జోక్యంచేసుకుంటుందని ప్రశ్నించారు. ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఉక్రెయిన్, అమెరికా , బ్రిటన్‌ నిరంతర సమాలోచనలు జరుపుతున్నాయి. రష్యాను చర్చలకు వఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతుండగా.. ఇలాంటి చర్యలు చేపట్టడం అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఉక్రెయిన్‌పైదాడి ఆలోచన విరమించుకోకుంటే, గట్టి ఎదురుదెబ్బ తప్పదని ఇప్పటికే అమెరికా.. రష్యాకు స్పష్టం చేసింది.

Exit mobile version