Site icon NTV Telugu

Space Tour: అంత‌రిక్ష ప్ర‌యాణానికి వెళ్లాల‌ని అనుకుంటున్నారా… ధ‌ర ఎంతో తెలుసా..!!

అంత‌రిక్షంలోకి ప్ర‌యాణించేవారి సంఖ్య గ‌త కొంత‌కాలంగా పెరుగుతున్న‌ది. అమెరికాకు చెందిన వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇటీవ‌లే అంత‌రిక్ష ప్రయాణానికి సంబంధించి ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించింది. ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంతో అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకొని అంత‌రిక్ష ప్ర‌యాణాల‌కు వ‌ర్జిన్ సంస్థ సిద్ద‌మైంది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్య‌లో క‌మ‌ర్షియ‌ల్ ఫ్లైట్ల‌ను న‌డపాల‌ని నిర్ణ‌యించింది. ఆస‌క్తిగ‌ల ప‌ర్యాట‌కులను అంత‌రిక్షంలోకి తీసుకొని వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్ర‌యాణానికి సంబంధించిన ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించింది.

Read: Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి నుంచి థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ

ఒక్కో టికెట్ ధ‌ర‌ను 4.5 ల‌క్ష‌ల డాల‌ర్లుగా నిర్ణ‌యించింది. టికెట్ కావాలి అనుకున్న వారు ముందుగా 1.5 లక్ష‌ల డాల‌ర్ల‌ను డిపాజిట్ చేయాల‌ని, మిగిలిన మొత్తాన్ని ప్రయాణానికి ముందు చెల్లించాల‌ని గెలాక్టిక్ తెలియ‌జేసింది. ఇక‌పోతే, ఈ ఏడాది చివ‌రినాటికి సుమారు 1000 మంది ప్రయాణికుల‌ను అంత‌రిక్షంలోకి పంపాల‌ని నిర్ణ‌యించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మెుదటి స్పెస్ ఫ్లైట్ టూర్ ఉంటుందని వెల్లడించింది. ఈ ప్రయాణం సుమారు 90 నిమిషాలు పాటు కొనసాగుతుందని వెల్లడించింది.

Exit mobile version