Site icon NTV Telugu

Viral Video: ఎయిర్‌పోర్టులో పొట్టుపొట్టు తన్నుకున్నారు. వీడియో వైరల్..

Viral Video

Viral Video

Viral Video: కొన్నిసార్లు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. ఇండియాలో ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చాలా వరకు అరుదు. అదికూడా అమెరికా లాంది దేశాల్లో. సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో గొడవలు జరగడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్రంగా తన్నుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అది కూడా అమెరికాలోని చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది.

Read Also: Rahul Gandhi: ఇది రాష్ట్రపతిని అవమానించడమే.. కొత్త పార్లమెంట్ వివాదంపై రాహుల్ గాంధీ

చికాగోలోని ఓ’హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ పోరాటమే జరిగింది. 10 నుంచి 15 మంది వరకు వ్యక్తులు ఈ గొడవలో పాల్గొన్నారు. సోమవారం డిప్లానింగ్ చేస్తున్న సమయంలో మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజీ క్లెయిమ్ ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో 24 ఏళ్ల మహిళను ఇద్దరు కొట్టారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చికాగో విమానాశ్రయంలో టెర్మినట్ 3లో అనేక మంది ఈ గొడవలో పాల్గొన్నారు. మహిళల నేలపై పడుకుని ఒకరి జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని చికాగో ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version