Site icon NTV Telugu

Viral Video: షాకింగ్ వీడియో.. గాలివాన బీభత్సం.. ఏకంగా విమానమే కొట్టుకుపోయింది.. ఎక్కడంటే!

Airplane

Airplane

తుఫాన్ వల్ల కురిసే వర్షాలు, బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. అలాగే భారీ వర్షాల కారణంగా వరదలకు ఇల్లు కూలిపోవడం, మునిగిపోయిన ఘటనలు కూడా చూశాం. వాహనాలు కూడా వరదల్లో కలిసిపోయిన ఘటనలు అనేకం. కానీ గాలి విమానం కొట్టుకుపోయిన విచిత్ర సంఘటన చూశారా? కనీసం విని కూడా ఉండరు కదా. కానీ తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గాలికి పార్క్ చేసి ఉన్న విమానం ఒరిగిపోయిన వీడియో ఒకటి నెట్టింట బయటకు వచ్చింది.

Also Read: Komati Reddy: ఎన్నేళ్ళు కష్టపడ్డా నిన్ను సీఎం చేయరు.. హరీష్‌ రావు కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్

ఈ సంఘటన అర్జెంటీనా విమానాశ్రయంలో చోటు చేసుకుంది. అక్కడ రాత్రి వీచిన గాలివాన బీభత్సానికి ఏకంగా విమానమే ఒరిగిపోయింది. ప్రస్తుతం అర్జెంటీనాలో భీక‌ర గాలివాన ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. దాదాపు 150 కిలోమిటర్ల వేగంతో భయంకరమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయంలో పార్కింగ్‌లో ఉన్న ఓ ప్రైవేటు విమానం బలమైన ఈదురు గాలుల ధాటికి ప‌క్కకు క‌దిలింది. ర‌న్‌వేపై పార్క్ చేసి ఉన్న ఆ విమానం.. జోరుగా వీస్తున్న గాలి ప్రభావానికి.. స్పిన్ అయ్యింది. అదే ర‌న్‌వేపై ఉన్న బోర్డింగ్ స్టెప్స్ కూడా ప‌క్కకు ఒరిగాయి.

Also Read: Revanth Reddy vs Harish Rao: కాళేశ్వరం నీటిపై అసెంబ్లీలో రచ్చ..

విమానం ఒరిగిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు ఈ గాలివాన బీభత్సం వల్ల అర్జెంటీనాలో భారీగా ఆస్తి, ప్రాణ వాటిల్లింది. ఈ గాలివానలకు అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు, బ‌హియా బ్లాంకా సిటీలో బ‌ల‌మైన గాలికి రోల‌ర్ స్కేటింగ్ క్రీడాప్రాంగ‌ణం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 14 మంది గాయ‌ప‌డ్డారు. బ‌హియా బ్లాంకా ప్రదేశాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు జావియ‌ర్ మిలే స్వయంగా సందర్శించారు.

Exit mobile version