సాధారణంగా ప్రజలు పాములను చూసిన వెంటనే పారిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు. కొందరు ప్రాణాలకు తెగించి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కొందరు వాటిని జాగ్రత్తగా అటవీ ప్రాంతంలో వదలి పెడుతుంటారు. దాదాపు మన దేశంలో 250 రకాల పాములు ఉన్నాయి. వాటిలో 50 జాతుల మాత్రమే విషపూరితమైనవి. కొన్ని సందర్భాల్లో అవి జనావాసాల్లోకి వస్తుంటాయి. దీంతో వాటిని చూసి చంపడం చేస్తుంటారు చాలా చేస్తుంటారు. కొందరు మాత్రమే వాటిని వాటి స్థానాల్లో వదిలేస్తుంటారు.
Read Also: Father Kills Man: బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు.. తండ్రి ఏం చేశాడంటే..
ప్రస్తుతం పాములకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో సముద్ర తీరంలో పడి ఉన్న విషపూరిత పాముల ప్రాణాలను ఓ వ్యక్తి కాపాడి.. వాటిని సముద్రంలో వదిలేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బీచ్ లో నడుచుకుంటూ వెళ్లగా.. అతడికి కొన్ని పాములు ఒడ్డుకు పడి ఉండడం కనిపించాయి. వాటిని చూసిన ఆ యువకుడు … పాములను ఒక గంపలో పెట్టుకుని సముద్రంలోకి వెళ్లి వాటిని వదిలేశాడు. దీంతో అవి తలొ దిక్కుకు వెళ్లాయి. వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో తెగవైరల్ గా మారింది.
Read Also:Bollywood Actor: పండగ పూట విషాదం.. ప్రముఖ హస్య నటుడు మృతి
అన్ని విషపాములను కాపాడడమంటే గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరైతే.. అందులో ఒక్కటి కాటేసిన నువ్వు పైకి పోవడం గ్యారంటీ అంటూ కామెంట్ చేశారు. వాటిని పట్టుకునేటప్పుడు అతను ముఖంలో భయం ఎక్కడా కనిపించలేదు. ఈ విధంగా ఆ వ్యక్తి 100 కి పైగా విషపూరిత పాముల ప్రాణాలను కాపాడాడని వీడియో పేర్కొంది. అయితే ఇది AI వీడియోగా కనిపిస్తుంది
