Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి

  • వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం
  • 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
  • ప్రమాదం జరిగిన సమయంలో 32 మంది
Vietnam2

Vietnam2

వియత్నాంలో ఘోర ప్రమాదం జరిగింది. హోలాంగ్‌బేల్‌లో టూరిస్ట్ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 32 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విహారయాత్ర కోసం వియత్నాం వెళ్లారు. అయితే వారు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు కూడా ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే వియత్నాం అధికారులు భారీ స్థాయిలో సహాయక చర్యలు ప్రారంభించారు. నౌకాదళం, కోస్ట్ గార్డ్ బృందాలు, స్థానిక రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అయితే వారి పూర్తి వివరాలు, స్వస్థలాలు, కుటుంబ సభ్యుల సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం కూడా వియత్నాం అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బోటు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులా, సాంకేతిక లోపమా, లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోని బంధువులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.