Site icon NTV Telugu

Maldives: మాల్దీవుల పార్లమెంట్‌లో గందరగోళం.. ఎంపీల కొట్లాట.. వీడియో వైరల్..

Maldives

Maldives

Maldives: హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం మాల్దీవులు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. భారతదేశంతో వివాదం, ప్రధాని నరేంద్రమోడీ గురించి ఆ దేశ మంత్రులు అసభ్యకరంగా మాట్లాడటం ఒక్కసారిగా వివాదాస్పదమైంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనాకు అనుకూలంగా, భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్జాతీయ మీడియాలో మాల్దీవులు హెడ్‌లైన్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఆ దేశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ దేశ పార్లమెంట్‌లో ఎంపీలు మధ్య ఘర్షణ, ఒకరిని ఒకరు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సొషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ క్యాబినెట్‌‌కి పార్లమెంట్ ఆమోదం కోసం సమావేశమైంది.

Read Also: Flat Sizes: దేశంలోని పెద్ద నగరాల్లో పెరిగిన ‘ఫ్లాట్ సైజులు’.. టాప్‌లో మన హైదరాబాద్..

అధికార కూటమి అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎన్సీ), ప్రొగ్రెసివ్ పార్టీ ఆప్ మాల్దీవ్స్(పీపీఎం), ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ(ఎండీపీ) మధ్య ఘర్షణలు జరిగాయి. ఆన్‌లైన్‌లో వైరల్ వీడియోల ప్రకారం.. పార్లమెంట్ లోనే ఎంపీలు తన్నుకోవడం చూడవచ్చు. కొంతమంది ఎంపీలు పోడియం వద్ద గందరగోళం సృష్టించారు.

అధికార కూమికి చెందిన ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలను తమ ఛాంబర్లలోకి రాకుండా అడ్డుకున్నాడు. ఎండీపీకి పార్లమెంట్‌లో మెజారిటీ ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యులు ముయిజ్జూ క్యాబినెట్లో చేరకుండా ఎండీపీ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. పార్లమెంట్ లోపల గలాటాకు సంబంధించిన వీడియోలో ఎంపీలు ఫ్లోర్‌పై పడి ఒకరిపై ఒకరు దాడి చేయడం, ఎంపీ జుట్టు పట్టుకుని లాగడం చూడవచ్చు. వీడియోలో కనిపించిన ఇద్దరు ఎంపీల్లో మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) ఎంపీ ఇసా మరియు పాలక PNC ఎంపీ అబ్దుల్లా షహీమ్ అబ్దుల్ హకీమ్ ఉన్నారు.

Exit mobile version