NTV Telugu Site icon

Viral Video: రష్యా ప్రతినిధిని కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ.. వీడియో వైరల్..

Russia Ukraine War

Russia Ukraine War

Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు బద్ధశతృవులుగా మారాయి. ఈ శతృత్వం ప్రజలు, రాజకీయ నాయకుల్లో కూడా పేరుకుపోయింది. ఇందుకు ఓ వీడియో ప్రస్తుతం సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో గురువారం బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.

Read Also: Kaviya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్.. కనీసం కావ్య పాప కోసమైనా గెలవండి..

ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్ మారికోవ్స్కీ జాతీయ జెండాను పట్టుకుని ఉన్న సమయంలో రష్యా ప్రతినిధి జెండాను లాగేసి, చించడంతో ఈ గొడవ ప్రారంభం అయినట్లు వీడియోలో చూడవచ్చు. దీంతో కోపంతో ఊగిపోయిన ఉక్రెయిన్ ఎంపీ, రష్యా ప్రతినిధి ముఖంపై పంచ్ లు ఇస్తూ దాడి చేశాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 30 ఏళ్ల క్రితం ఏర్పడిన సంస్థ. దీంట్లో ఉక్రెయిన్, రష్యా సభ్యదేశాలు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఈ సంస్థ ఏర్పడింది.

రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్లతో దాడి చేసి అధ్యక్షుడు పుతిన్ ను హతమార్చేందుకు ప్రయత్నించిన ఒక రోజు తర్వాత టర్కీ వేదికగా ఈ గొడవ జరిగింది. పుతిన్ పై హత్యాయత్నం ఉక్రెయిన్ కుట్ర అని రష్యా ఆరోపిస్తోంది. దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. రష్యా కీలక నేత దిమిత్రి మెద్వదేవ్ ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని చంపేస్తామని చెప్పాడు.