NTV Telugu Site icon

Israel-Labnon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. కుప్పకూలిన భారీ నివాస భవనం

Beirutlebanon

Beirutlebanon

హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్ ప్రజలను నివాసాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ దళాలు హెచ్చరించాయి. అలా వార్నింగ్ ఇచ్చిందే తడువు.. బీరుట్‌పై ఐడీఎఫ్ దళాలు క్షిపణులతో దాడులు చేసింది. బీరుట్‌లోని బహుళ అంతస్తుల బిల్డింగ్‌ను ఇజ్రాయెల్ క్షిపణి కూల్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Salaar 2: సలార్ 2 నుంచి షాకింగ్ అప్డేట్.. ఇక పండగే!

ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇల్లే లక్ష్యంగా హిజ్బుల్లా దళాలు క్షిపణులు ప్రయోగించాయి. నెతన్యాహు నివాసం సమీపంలో ఈ క్షిపణుల పడ్డాయి. అయితే ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్.. లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. బీరూట్ సిటీ పార్క్ పక్కన ఉన్న తయౌనె పరిసర ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనం ఉంది. దీనిపై రాకెట్ ప్రయోగించగానే సెకన్ల వ్యవధిలోనే కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ క్షిపణి దాడికి సుమారు 40 నిమిషాల ముందు ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి అరబిక్ భాషలో సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. బీరుట్‌లోని దక్షిణ శివారులోని రెండు భవనాల్లోని నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని హెచ్చరించారు.