NTV Telugu Site icon

Viral video: ఆకతాయిలు చిల్లర చేష్టలు.. ట్రైన్ వెళ్తుండగా నీళ్లు పోసిన యువకులు.. చివరికిలా!

Train

Train

ఓ ట్రైన్ పట్టాలపై పరుగులు పెడుతోంది. రైలు ఆగదులే.. ఏం చేసినా ఫర్వాలేదు అనుకున్నారు కొందరు ఆకతాయిలు. ఇంకేముంది.. రైల్వే ట్రాక్‌ ఆనుకుని ఒక చెరువు ఉంది. అందులో బైక్ స్టాండ్ చేసి స్టార్ట్ చేశారు. చక్రం స్పీడ్‌గా తిరుగుతూ.. ట్రైన్‌పైకి నీళ్లు చిమ్ముతోంది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులంతా తడిచిపోయారు. దీన్ని గమనించిన పోలీసులు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు వెంటనే చైన్ లాగి ట్రైన్ ఆపేశారు. అంతే వేగంగా రైల్వే సిబ్బంది కిందకి దిగి.. యువకుల్ని పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా బైక్‌ను కూడా రైల్లో వేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Teacher Transfers: తెలంగాణలో 18, 942 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు..!

కొందరి యువకుల చిలిపి పనుల కారణంగా రైలు అర్ధాంతరంగా ఆగిపోయింది. రైలు వెళ్తుండగా.. ట్రాక్‌ను ఆనుకుని ఉన్న చెరువు నుంచి నీళ్లు చిమ్మారు. దీంతో కోపోద్రేకులైన ప్రయాణికులు.. యువకుల భరతం పట్టారు. యువకులకు బడిత పూజ చేసి.. బైకు ట్రైన్‌లో వేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి.