Site icon NTV Telugu

Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..

Boeing 737

Boeing 737

Boeing 737: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఏదో ఒక సమస్య కారణంగా ఇటీవల బోయింగ్ విమానాల గురించి చర్చ నడుస్తోంది. తాజాగా బోయింగ్ 737 విమానం టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయింది. ఇది మరోసారి వివాదానికి దారి తీసింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ లోని ఓఆర్ టాంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి.

Read Also: Sidhu Moosewala: లోక్‌సభ బరిలోకి సిద్ధూ మూసేవాలా తండ్రి.. ఎక్కడ్నుంచంటే..!

వీడియోలో ఎయిర్‌పోర్టులో విమానం టేకాఫ్ సమయంలో చక్రం నుంచి పొగలు రావడం కనిపించింది. విమానం అండర్ క్యారేజ్, కుడి వింగ్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు కనిపించింది. ఇది జరిగిన వెంటనే ఫ్లైట్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు నివేదించబడలేదని ఎయిర్ లైనర్ సంస్థ ఫ్లై సఫైర్ వెల్లడించింది. గ్రౌండ్ సిబ్బంది టైర్ కోల్పోవడాన్ని పైలెట్‌కి సమాచారం ఇవ్వడంతో మళ్లీ విమానాశ్రయాలనికి తిరిగి వచ్చి సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానాన్ని బరువు తగ్గించేందుకు ఇందనాన్ని ఆకాశంలోనే డంప్ చేసింది. దీంతో ఎలాంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ అయింది.

Exit mobile version