NTV Telugu Site icon

Lalit Modi: లలిత్ మోడీకి షాక్‌.. పౌరసత్వం రద్దు చేసిన వనాటు ప్రభుత్వం

Lalitmodi

Lalitmodi

ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వనాటు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపట్.. పౌరసత్వ కమిషన్‌కు ఆదేశించారు. ఇటీవలే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు పౌరసత్వానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును లలిత్ మోడీ  తీసుకున్నారు. ఇండియాలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు లలిత మోడీని స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే లండన్‌ను భారత్ కోరింది. అక్కడ నుంచి వనాటుకు మకాం మార్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వనాటు ప్రభుత్వం కూడా పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

లలిత్ మోడీపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాక వనాటు ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీంతో లలిత్ మోడీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ప్రధాన మంత్రి జోతం నపట్ ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

లలిత్ మోడీ 2010లో భారతదేశం విడిచి వెళ్లారు. ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై వేటు పడింది. అనంతరం లండన్‌కు పారిపోయారు.

ఇటీవల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను లలిత్ మోడీ పరిచయం చేశారు. ఆమెతో ఎప్పటి నుంచో స్నేహం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. అంతకముందు కూడా మాజీ మిస్ యూనివర్సిల్ సుస్మితా సేన్‌తో కూడా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమెతో ప్రయాణం సాగుతుందని పేర్కొ్న్నారు. మళ్లీ ఏమైందో తెలియదు గానీ.. ఇటీవల మరో కొత్త ప్రియురాలిని పరిచయం చేశారు.