NTV Telugu Site icon

USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు

Fbi Office Ohio

Fbi Office Ohio

Ohio Police officers killed an armed man who tried to breach the FBI office: అమెరికాలోని ఓహియో సిన్సినాటి ఫీల్డ్ లోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీ ఐ) కార్యాలయంపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసుల కాల్చిచంపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఎఫ్ బీ ఐ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు సాయుధ దుండగుడు ప్రయత్నించారు. సుదీర్ఘ ప్రతిష్టంభన తరువాత దుండగుడిని ఓహియో పోలీసులు కాల్చి చంపారు. హై సెక్యురిటీ ప్రాంతంగా ఉన్న ఎఫ్ బీ ఐ కార్యాలయంలో చొరబడేందుకు నిందితుడు ఎందుకు ప్రయత్నించాడనే దానిపై విచారణ జరుగుతోంది. ఘటన వెనక ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

నిందితుడు పక్కాగా ఎఫ్ బీ ఐ కార్యాలయంపై దాడి చేసేందుకు వచ్చాడని తెలుస్తోంది. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని.. ఆ తరువాత పారిపోయాడని.. అయితే పోలీసులు అతడిని ఛేజ్ చేసి పట్టుకునేందుకు, మాట్లాడేందుకు ప్రయత్నించారని, కానీ పోలీసులపైకి గన్ ఎక్కుపెట్టడంతో కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Jammu Kashmir: ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం, ముగ్గురు జవాన్లు వీరమరణం

అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరిలో 6న యూఎస్ క్యాపిటల్ పై జరిగిన దాడిలో పాల్గొన్న వ్యక్తులతో, ఇతర ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా ఇంటిపై ఎఫ్ బీ ఐ అధికారుల దాడుల తరువాత ఓహియో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎఫ్ బీ ఐ డైరెక్టర్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇంటిలో సోదాలు చేసిన తర్వాత ఎఫ్ బీ ఐ ఏజెంట్లకు బెదిరింపులు పెరిగాయి.. రిపబ్లికన్లు ఎఫ్ బీ ఐకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.

Show comments