NTV Telugu Site icon

US flight: ప్రయాణికురాలికి చేదు అనుభవం.. థ్యాంక్యూ సార్ అన్నందుకు సిబ్బంది ఝలక్

Dkeke

Dkeke

పొరపాటున థ్యాంక్యూ సార్ అన్నందుకు ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానం ఎక్కకుండా చేశారు. ఈ ఘటన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.

ప్రయాణానికి సిద్ధమైన ఓ ప్రయాణికురాలికి ఎయిర్‌‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్‌’ అన్నందుకు విమానం నుంచి దించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె తన బిడ్డతో పడిన ఆవేదన తెలియజేసింది.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్‌ బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు, తల్లితో విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్‌ పాస్‌ను అందించారు. దీంతో మహిళా సిబ్బందిని పొరపాటుగా పురుషుడిగా భావించి.. ‘థాంక్యూ సర్‌’ అని సంభోదించింది. అంతే ఆ పిలుపునకు ఆమె ఆగ్రహానికి గురైంది. ప్రయాణికురాలి తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది.

అదే సమయంలో జెన్నా లాంగోరియా మరో మేల్‌ ఫ్లైట్‌ అటెండెంట్‌ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని ఆయన గేట్‌ దగ్గర ఆపేశారని ఫిర్యాదు చేసింది. ఫ్లైట్‌ అటెండెంట్‌ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకపోగా.. విమానం నుంచి దింపేశారని సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జెన్నా లాంగోరియా టెక్సాస్‌కు చెందిన మహిళా ఆరోగ్య నిపుణురాలుగా ఉన్నారు.