ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకు తాలీబన్ ఉగ్రవాదుల దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు అక్కడి సామాన్య ప్రజలకు నరకం చూపిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ దళాలకు, తాలీబన్‌లకు మధ్య పోరు జరుగుతున్నది. ఆఫ్ఘన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని, అక్కడ ఉండటం ఏమాత్రం సురక్షితం కాదని, ఒకవేళ టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకుంటే రుణాలు అందిస్తామని కాబూల్‌లోని యూఎస్ రాయబార కార్యాలయం తెలియజేసింది. కాబూల్ వెలుపల పరిస్థితులు సరిగా లేకపోవడంతో రోడ్డు, విమాన సర్వీసులు త్వరలోనే బంద్ కానున్నాయి. దీంతో అమెరికా పౌరులు ఎవరైనా ఉంటే వారు వెంటనే అమెరికా వెళ్లిపోవాలని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది.
ఆ దేశం నుంచి వచ్చే పౌరులకు అమెరికా రుణాలు…
