Site icon NTV Telugu

Skin Cancer: సబ్బుతో స్కిన్ క్యాన్సర్‌కి చెక్.. యంగ్ సైంటిస్ట్ వినూత్న ఆవిష్కరణ..

Skin Cancer

Skin Cancer

Skin Cancer: వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ కొన్ని వ్యాధులకు పూర్తిగా చికిత్స కలిగిలేము. ఇందులో క్యాన్సర్ కూడా ఉంది. అయితే అమెరికాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతం చేశాడనే చెప్పాలి. హేమన్ బెకెలే చర్మ క్యాన్సర్ తో పోరాడేందుకు ఓ సబ్బును కనుగొన్నాడు. 2023 3ఎం యంగ్ సైంటిస్ట్స్ ఛాలెంజ్ లో 9 మంది వ్యక్తులతో పోటీ పడిన అతను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా విజయం సాధించాడు. 25,000 డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు.

Read Also: Congress: బీజేపీ-బీఆర్‌ఎస్‌ల లగ్గం పిలుపు.. పెండ్లి కార్డు విడుదల చేసిన కాంగ్రెస్

కేవలం 10 డాలర్ల విలువ కలిగిన ఈ సబ్బు చర్మాన్ని రక్షించే కణాలను తిరిగి పెంపొందిస్తుందని, క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే వారికి తగిన శక్తిని ఇస్తుందని హేమాన్ తెలిపారు. తాను ఇథియోపియాలో ఉన్న సమయంలో, అక్కడి ప్రజలు నిత్యం ఎండకు గురికావడాన్ని చూసి ఈ ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం చర్మ క్యాన్సర్ పై తన పరిశోధనను కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. సైన్యం పరంగా ఈ ఆవిష్కరణ గొప్పదే కాకుండా, అందరికి అందుబాటులో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

హేమన్ కంప్యూటీర్ మోడలింగ్ ఉపయోగించిన సబ్బు కోసం నమూనా సూత్రాన్ని రూపొందించారు. స్కిన్ క్యాన్సర్ ట్రీటింగ్ అని పేరు పెట్టిన ఈ సబ్బు డెన్డ్రిటక్ కణాలను పునరుద్ధరించడానికి ఊపయోగపడే సమ్మేళనాలను ఉపయోగించడం ద్వారా పనిచేస్తుందని హేమన్ కి మెంటార్ గా పని చేసిన ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ డెబోరా ఇసాబెల్లె తెలిపారు. డెన్ట్రిటిక్ కణాల పునరుద్దరణ తర్వాత ఇది క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడగలదని, తనను తాను ఎలా రక్షించుకోవాలనే విషయాన్ని శరీరానికి గుర్తు చేస్తుందని తెలిపారు.

Exit mobile version