NTV Telugu Site icon

Amritpal Singh: ఖలిస్తానీ అమృ‌త్‌పాల్ సింగ్‌ని జైలు నుంచి విడుదల చేయాలి.. కమలా హారిస్‌ని కోరిన సిక్కు లాయర్..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. భారత్ నుంచి ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతు తెలిపే వ్యక్తి ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్యవాదులు హర్షించడం లేదు. ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణలో అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్‌ని విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్‌పై దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

Read Also: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ

ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను విడుదల చేయడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అమెరికా-సిక్కు అటార్నీ జస్‌ప్రీత్ సింగ్ అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌ను సంప్రదించారు. ‘‘వారిస్ దే పంజాబ్’’ చీఫ్ పలు ఉగ్రవాద ఆరోపణలతో జైలులో ఉన్నాడు. అయితే, ఈ కేసును తానను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని, అమృతపాల్‌ను నిర్బంధించడం అన్యాయమని తాను నమ్ముతున్నానని జస్‌ప్రీత్ సింగ్ అన్నారు. గతేడాది ఏప్రిల్‌లో నెల రోజుల పరారీ తర్వాత ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కఠినమైన జాతీయ భద్రతా చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే, ఎన్నికల్లో గెలిచిన అమృత్‌పాల్ విడుదల కోసం భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి వందమందికి పైగా అమెరికన్ చట్టసభ సభ్యులతో చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు జస్‌ప్రీత్ సింగ్ చెప్పారు. కమలా హారిస్‌ని గత రెండుమూడు నెలల్లో రెండుసార్లు కలిసినట్లు వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో పాటు అమృత్‌పాల్ విషయాన్ని చర్చించినట్లు తెలిపారు. అమృతపాల్ సింగ్ విజయం అఖండ విజయం, మరియు అతని నిరంతర నిర్బంధం మానవ హక్కుల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని అన్నారు.

Show comments