NTV Telugu Site icon

US President salary: అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి ఎంత సాలరీ.? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..?

Us President Salary

Us President Salary

US President salary: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 4న యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్ పోటీలో ఉన్నారు. అయితే, అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి ఎంత ఉంటుంది..? ఏఏ సౌకర్యాటు ఉంటాయనే దానిపై అందరిలో ఆసక్తి ఉంటుంది.

2001లో ట్రెజరీ అప్రాప్రియేషన్ బిల్లులోని నిబంధనల ద్వారా అధ్యక్షుడి వార్షిక ఆదాయం 4,00,000 డాలర్లుగా నిర్ణయించబడింది. అంతకుముందు మూడు దశాబ్ధాలు ఇది 2 లక్షల డాలర్లుగా ఉండేది.

దీంతో పాటు అధ్యక్షుడికి ప్రిసిడెన్షియల్ లిమోసిస్, మెరైన్ వన్, ఎయిర్ ఫోర్స్ వన్ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అధ్యక్షుడుకి వైట్‌హౌజ్ నివాసంగా ఉంటుంది. ఎన్నికైన అధ్యక్షుడు వైట్‌హౌజ్‌ని తనకు ఇష్టమున్న రీతిలో అలంకరించుకోవడానికి 1,00,000 డాలర్లు అందుకుంటాడు.

Read Also: STAR Hospital: మెన్ ఫర్ ఉమెన్ పేరుతో స్టార్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమం.. ముఖ్య అతిథిగా హీరో శ్రీకాంత్

ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్, ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ చెఫ్ తయారు చేసిన భోజనాన్ని తీసుకుంటారు. వైట్‌హౌజ్‌లో పనిమనిషి, ప్లంబర్, ఫ్లోరిస్ట్, హెచ్ హౌజ్ కీపర్‌తో సహా 100 మంది సాధారణ పనివాళ్లు ఉంటారు.

అధ్యక్షుడికి 50,000 డాలర్లను ఖర్చులకు, 19,000 డాలర్లను వినోద ఖర్చల కోసం అందుకుంటాడు. నాన్-టాక్సబుల్ ట్రావెట్ అకౌంట్‌లో 1,00,000 డాలర్లను కలిగి ఉంటాడు.

పదవీ విరమణ తర్వాత ఇతర ప్రయోజనాలను అనుభవిస్తాడు. ప్రస్తుత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2,30,000 డాలర్లను వార్షిక పెన్షన్‌గా పొందుతున్నాడు. ఇది క్యాబినెట్ సెక్రటరీ పెన్షన్‌కి సమానం.

ఇక వైస్ ప్రెసిడెంట్ వార్షిక వేతనం ప్రస్తుతం 2,35,100 డాలర్లుగా ఉంది. ట్రంప్ హయాంలో దీనిని 2,43,500 డాలర్లకు పెంచే ప్రయత్నం జరిగింది.