Site icon NTV Telugu

జో బైడెన్ 100 రోజుల పాలన: భారత్ తో బంధం బలపడిందా?   

అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందరోజులు పూర్తయింది.  ఈ సందర్భంగా అయన స్టేట్ ఆఫ్ ది యూనియన్ అనే కార్యక్రమంలో ప్రసంగించారు.  ఈ సందర్భంగా భారత్ తో ఈ వందరోజుల్లో ఎలాంటి బంధం బలపడిందో వివరించారు.  వంద రోజుల్లో భారత్ తో బలమైన బంధం ఏర్పడిందని, ఇటీవలే ప్రధాని మోడీతో తాను మాట్లాడానని తెలిపారు.  అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్, భారత విదేశాంగశాఖ మంత్రి అనేకమార్లు చర్చలు జరిపారని, రెండు దేశాల మధ్య బంధానికి ఇరువురి మధ్య జరిగిన చర్చలు నిదర్శనం అని అన్నారు.  అదే విధంగా డిఫెన్స్ సెక్రటరీ భారత్ లో పర్యటించారని ఇరు దేశాల మధ్య భద్రతా పరమైన చర్చలు జరిగాయని, మైత్రికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు.  కరోనా మహమ్మారి సమయంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడిందని, భారత్ కు సహకరిస్తామని తెలిపారు.  

Exit mobile version