Site icon NTV Telugu

Ukraine Issue: ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌పై అమెరికా కీల‌క వ్యాఖ్య‌లు… వెన‌క్కి వ‌చ్చేయండి…

ఉక్రెయిన్ ర‌ష్యా మ‌ధ్య ప‌రిస్థితులు రోజురోజుకు దిగ‌జారిపోతున్నాయి. ఉక్రెయిన్‌కు అండ‌గా ఉండేందుకు నాటో, అమెరికా దేశాలు సైన్యాన్ని పంపుతుండ‌గా, ర‌ష్యా సైతం పెద్ద సంఖ్య‌లో ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో సైన్యాన్ని మోహ‌రిస్తున్న‌ది. అయితే, ర‌ష్యాను ధీటుగా ఎదుర్కొంటామ‌ని చెబుతున్న అమెరికా అవ‌స‌ర‌మైతే మ‌రికొంత సైన్యాన్ని కూడా త‌ర‌లిస్తామ‌ని చెబుతున్నది. అటు నాటో దేశాలు కూడా సైన్యాన్ని మోహ‌రిస్తున్నాయి. ర‌ష్యా సైనిక చ‌ర్య‌కు దిగితే ఆర్థిక‌ప‌ర‌మైన చర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పిన కొన్ని గంటల్లోనే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తివంత‌మైన సైనిక శ‌క్తి క‌లిగిన దేశాల్లో ర‌ష్యాకూడా ఒక‌టి అని, ఉక్రెయిన్‌లో ప‌రిస్థతులు మారిపోతున్నాయ‌ని, అమెరిక‌న్లు అక్క‌డి నుంచి వెన‌క్కి వ‌చ్చేయ్యాల‌ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆదేశించారు. ర‌ష్యాతో తాము డీల్ చేయ‌బోతున్నామ‌ని, చాలా భిన్న‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని, ఏ క్ష‌ణమైనా ప‌రిస్థితులు చాలా క్రేజీగా మార‌వ‌చ్చ‌ని జోబైబెన్ పేర్కొన్నారు.

Read: E Bike: 15 రూపాయ‌ల‌కే 45 కిలోమీట‌ర్ల ప్ర‌యాణం…

Exit mobile version