NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్లో ఉద్రిక్తత.. యూఎస్ పౌరులకు హెచ్చరికలు

Us

Us

Pakistan: పాకిస్తాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పీటీఐ పార్టీ నేతలు, మద్దతుదారులు తల పెట్టిన ఆందోళనల కారణంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో శాంతి భద్రతలు అదుపు తప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు ఆ దేశ అడ్వైజరీ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 16వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. తమ దేశ పౌరులు పెషావర్లోని సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే తప్ప ఖైబర్ ఫకున్ ఖ్వా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక, సెరెనా హోటల్ పరిసర ప్రాంతాల్లో మిలిటెంట్లు దాడులు చేసే ఛాన్స్ ఉందన్నారు. కాగా, డిసెంబర్ 16వ తేదీ వరకు తమ సూచనలు తప్పకుండా పాటించాలని వెల్లడించింది.

Read Also: Maharashtra CM Post: మహారాష్ట్ర సీఎం ఎంపికపై నేడు కీలక భేటీ..

కాగా, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి రిలీజ్ చేయాలని పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనల్లో పలువురు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. దీంతో, దాదాపు 10 వేల మంది పీటీఐ సపోర్టు చేసే వారిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, పాక్ ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది.