Site icon NTV Telugu

H-1B visa: “భారతదేశం అమెరికన్ కలల్ని దొంగిలిస్తోంది”.. ట్రంప్ సర్కార్ ఆరోపణ..

H 1b

H 1b

H-1B visa: ట్రంప్ సర్కార్ భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. H-1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, భారతీయులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని పలు సందర్భాల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని కార్మిక శాఖ సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రకటనను విడుదల చేసింది. కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, యువ అమెరికన్ వర్కర్లకు ఉద్యోగాలు లేకుండా విదేశీయులను రిక్రూట్ చేసుకుంటున్నారని ఆరోపించింది. భారతదేశాన్ని ఈ H-1B వీసా అతిపెద్ద లబ్ధిదారుడిగా నేరుగా ఆరోపించింది.

ఎక్స్‌లో ఒక పోస్టులో..‘‘ యువ అమెరికన్ల అమెరికన్ డ్రీమ్‌ను వారు దొంగిలించారు. ఎందుకంటే H-1B వీసాను దుర్వినియోగం చేయడం వల్ల ఉద్యోగాలను విదేశీ వర్కర్లచే భర్తీ చేస్తు్న్నారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు, కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ నాయకత్వంలో, మేము కంపెనీలను వారి దుర్వినియోగానికి జవాబుదారీగా ఉంచుతున్నాము. అమెరికన్ ప్రజల కోసం అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాము.’’ అని పేర్కొంది.

Read Also: Fatty Liver: డాకర్ట్ చెప్పిన రహస్యం..! ఫ్యాటీ లివర్ నయం కావాలంటే ఈ చిట్కాలు పాటించండి..

H-1B వీసా సమ్మతిని ఆడిట్ చేయడానికి సెప్టెంబర్ 2025లో యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ‘‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’’ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ కార్మికులను టెక్, ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో, తక్కువ జీతం ఉన్న విదేశీ నిపుణులతో భర్తీ చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. H-1B వీసా అప్రూవల్స్‌లో 72 శాతం భారతీయులకే దక్కుతున్నాయని అమెరికా పేర్కొంది.

‘‘రాజకీయ నాయకులు, అధికారులు, కంపెనీలు H-1B వీసాను దుర్వినియోగం చేయడానికి అనుమతించడంతో అమెరికన్ల ఉద్యోగాలను విదేశీ కార్మికులు భర్తీ చేశారు. ట్రంప్ యువ అమెరికన్లకు కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు’’ అని ప్రకటన పేర్కొంది. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ ద్వారా ఈ వీసా దుర్వినియోగానికి కంపెనీలను జవాబుదారీగా ఉంచడానికి, నియామక ప్రక్రియలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చేలా చూసుకోవడానికి, అమెరికన్ల కలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.

Exit mobile version