ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ప్రజలు ఎవరూ కూడా ఉక్రెయిన్ రావొద్దని, పరిస్థితులు సరిగా లేవని రాయబార కార్యాలయం ప్రకటించింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడే అవకాశం ఉందని, యుద్ధవాతావరణం నెలకొందని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది. క్రిమియా, డొనస్క్, లూహాన్‌స్క్‌లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయని తెలియజేసింది. నల్ల సముద్రం తీరాన ఉన్న ప్రాంతంలో మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. దీంతో ఉక్రెయిన్, రష్యా కీవ్‌లో ఉన్న రాయబార కార్యాలయానికి సంబంధించిన కుటుంబాలను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉక్రెయిన్ సంక్షోభం: యూఎస్ కుటుంబాలను తరలించే పనిలో అమెరికా…
