US-Iran War: 40 రోజుల యుద్ధంతో అమెరికా సంవత్సరాల కష్టం వృథా..
- ఇరాన్ యుద్ధంతో భారీగా నష్టపోయిన అమెరికా..
- గల్ఫ్ ప్రాంతంపై బలహీనమైన ప్రభావం..
- మూడు దశాబ్ధాల అమెరికా శ్రమ నాశనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా ప్రపంచంలోనే గొప్ప మిలిటరీ శక్తి. అయితే, ఇరాన్ యుద్ధం తర్వాత యూఎస్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇరాన్ యూఏఈని అడ్డుకున్న తీరు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయిల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించిన వారంలోపే ఇరాన్‌లో తమ పాలన వస్తుందని భావించాయి, కానీ ఇరాన్ సైన్యం అమెరికాను తీవ్రంగా దెబ్బతింది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ యుద్ధం నుంచి ఎలా ఎగ్జిట్ కావాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు కాల్పుల విరమణ ప్రకటించి.. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ సహకారంతో శాంతి చర్చలకు సిద్ధమయ్యారు.
Read Also: Pakistan-Israel: చర్చలకు ముందు పాకిస్తాన్‌లో ఇజ్రాయిల్ భయాలు..
Also Read
- Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
- Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
- Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ఇదిలా ఉంటే, ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలో పవర్ బ్యాలెన్స్‌ను పూర్తిగా మార్చేసింది. ఇరాన్‌ను ఒక గొప్ప శక్తిగా మార్చింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్ దేశాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా, ఏన్నో ఏళ్లుగా అమెరికా నిర్మించుకుంటూ వచ్చిన సామ్రాజ్యాన్ని కూల్చేసింది. ఈ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలను ఇరాన్ సర్వనాశనం చేసింది. ఈ ప్రాంతంలోని సుమారు 12 స్థావరాలు ఇరాన్ దాడులకు గురయ్యాయి. ఇప్పుడు ఈ స్థావరాలను ఉపయోగించే స్థితిలో లేవని న్యూయార్క్ టైమ్స్ గతంలో నివేదించింది. అయితే, ఈ నష్టాల గురించి ట్రంప్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా వ్యవస్థల్ని ఇరాన్ ఒక నెలలో నాశనం చేసిందని అన్నారు. ఒకప్పుడు అమెరికన్ నేవీకి కేంద్రంగా పరిగణించిన బహ్రైయిన్‌లోని యూఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని ఇరాన్ టార్గెట్ చేసి దాడి చేసింది. ఈ యుద్ధం తర్వాత, గల్ఫ్‌లో అమెరికా పట్టు బలహీనపడింది. 1990 గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా ఆ ప్రాంతంలో విసత్రించింది. దాదాపుగా 19 పెద్ద సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 50,000 మంది సైనికుల్ని ఉంచింది. ఈ బలగాలు గల్ఫ్ దేశాల రక్షణ కోసం ఉద్దేశించబడినవి. అయితే, ఇప్పుడు ఇరాన్ వార్ తర్వాత ఇది చాలా బలహీనమైంది.
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!