Site icon NTV Telugu

USA: టెక్నికల్ ఇష్యూతో..విమాన ప్రయాణాలకు ఆటంకం

Sam (6)

Sam (6)

అమెరికాలో పలు సాంకేతిక సమస్యలతో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 1800 విమానాలపై పడింది అధికారులు తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టెలికాం సర్వీసుల్లో సమస్య తలెత్తడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపారు. . దీని కారణంగా డాలస్‌ సహా పలు ఎయిర్‌పోర్టులలో 1,800 విమానాలపై ప్రభావం పడిందన్నారు. విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణీకులు చాలా ఇబ్బంది పడ్డారు.

టెక్నికల్ ఇష్యూతో 20 శాతం విమానాలు రద్దు అయ్యాయని చెప్పుకొచ్చారు ఎఫ్ఎఫ్ఏ అధికారులు. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 200 కంటే ఎక్కువ విమానాలు రద్దు కాగా.. 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1,100ల విమానాలు చాలా ఆలస్యం కానున్నట్లు తెలిపారు.డెన్వర్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. యూఎస్ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌లోని సమస్యల పరిష్కారానికి జులైలో అమెరికా ప్రభుత్వం 12.5 బిలియన్‌ డాలర్ల నిధులు మంజూరుచేసింది.

Exit mobile version