NTV Telugu Site icon

US Fighter Jet Crash: హెలికాప్టర్ మాదిరి ల్యాండింగ్.. అదుపు తప్పి కూలిన ఫైటర్ జెట్

Us Fighter Jet Crash

Us Fighter Jet Crash

US fighter jet crashes on runway during vertical landing: ల్యాండ్ అవుతున్న సమయంలో.. అమెరికా వాయుసేనకి చెందిన ఎఫ్‌ 35బీ ఫైటర్‌ జెట్‌ విమానం ఒక్కసారి కుప్పకూలిపోయింది. రన్‌వే మీద పల్టీలు కొట్టింది. అయితే.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ చేసేందుకు ఆ పైలట్ చేసిన ప్రయత్నమే.. ఈ ఘటనకు కారణం. టెక్సాస్‌లోని ఎయిర్‌స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Tragedy In Honeymoon: హనీమూన్‌లో విషాదం.. ఇంటికి తిరిగి వస్తుండగా..

ఫోర్ట్ వర్త్‌లోని నావల్ ఎయిర్‌స్టేషన్ జాయింట్ రివర్స్ బేస్‌లో ఎఫ్‌ 35బీ విమానాన్ని పైలట్ సాధారణంగా ల్యాండ్ చేయకుండా.. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ చేయడాన్ని ఆ వీడియోలో మనం గమనించవచ్చు. ఇది ప్రయోగంలో భాగమో లేక ఇలాంటి ల్యాండింగ్‌కి పైలట్ ఎందుకు ప్రయత్నించాడో పక్కాగా తెలీదు కానీ.. వర్టికల్‌గా ల్యాండ్ చేయబోయాడు. అయితే.. చక్రాలు నేలను తాకిన వెంటనే జెట్ అదుపు తప్పింది. ఒక బంతి బౌన్స్ అయినట్టు.. కాస్త పైకి ఎగిరింది. ఆ తర్వాత ముందుభాగం పూర్తిగా ముందుకు ఒరిగి, నేలను ఢీకొట్టింది. పల్టీలు కొట్టేందుకు ప్రయత్నించింది. విమానాన్ని నియంత్రించేందుకు పైలట్ ప్రయత్నించాడు కానీ, అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. దీంతో.. అతడు ప్రాణాలు కాపాడుకునేందుకు పారాచూట్ సాయంతో బయటకొచ్చేశాడు. ఈ దృశ్యాన్ని అక్కడున్న వారు రికార్డ్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది.

Malaysia Landslide: కొండచరియలు విరిగిన ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య.. 12 మంది గల్లంతు

ఈ ఘటన జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి చేరుకొని.. జెట్‌ పేలకుండా తగిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఫైటర్ జెట్‌ని తయారు చేసిన లాక్‌హీడ్ మార్టీన్ సంస్థ స్పందిస్తూ.. ఈ ఘటనపై తాము ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది.