Site icon NTV Telugu

జులై 3 న ట్రంప్ భారీ ర్యాలీ…ఎందుకంటే…

జులై 4 వ తేదీ అమెరికాకు స్వాతంత్రం వ‌చ్చిన రోజు.  ఆ రోజున అమెరికాలో పెద్ద ఎత్తున అధికారిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తుంటారు.  ఇక‌పోతే, అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ జులై మూడో తేదీన పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వ‌హించేందుకు సిద్దం అవుతున్నారు.  జులై 3 వ తేదీ రాత్రి 8 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఆ ర్యాలీ జ‌రుగుతుంది.

Read: ఇవాళే సెట్స్ పైకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు!

ట్రంప్ సొంత ప్రాంతం ఫ్లోరిడాలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  రిప‌బ్లిక్ ఆఫ్ ఫ్లోరిడా ఈ కార్యక్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ది.  సేవ్ అమెరికా పేరుతో ట్రంప్ ఈ ర్యాలీని నిర్వ‌హిస్తుండ‌టం విశేషం.  క‌రోనా విష‌యంలో చైనాపై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మైన‌వే అనే దిశ‌గా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం కూడా నిర్ధార‌ణ‌కు వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ర్యాలీ జ‌రుగుతుండ‌టం విశేషం.  

Exit mobile version