Site icon NTV Telugu

అఫ్ఘానిస్థాన్‌ లోని ఐసిస్-కె మిలిటెంట్లపై అమెరికా డ్రోన్ దాడి

అఫ్ఘానిస్థాన్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలపై అమెరికా డ్రోన్‌ దాడులు చేసింది. ఇస్లామిక్‌ శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసిన నేపథ్యం లో కాబూల్‌ విమానాశ్రయాన్ని ఖాలీ చేయాలని పౌరులను అమెరికా హెచ్చరించింది. ఇటీవల కాబూల్‌ విమానాశ్రయం వెలువల జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం డ్రోన్‌ దాడులకు పాల్పడింది. కాబుల్‌ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులను వేటాడి, మట్టుబెట్టడం తథ్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతినబూనారు. పత్రీకారం తప్పదని హెచ్చరించారు.

Exit mobile version