Site icon NTV Telugu

Doomsday Mother: అంధవిశ్వాసంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి.. జీవిత ఖైధు విధించిన కోర్టు

Mother Killed Children

Mother Killed Children

Doomsday Mother: ‘డూమ్స్‌డే’ అంధవిశ్వాసంతో తన ఇద్దరు పిల్లల్ని హతమార్చడంతో పాటు తన భర్త మొదటి భార్య హత్య కుట్ర పన్నిన ఒక అమెరికా మహిళకు జీవిత ఖైదు విధించబడింది. ఆ మహిళ పేరు లోరీ వాల్లో. ఈ ఏడాది మే నెలలో తన 16 ఏళ్ల కుమార్తె టైలీ ర్యాన్, దత్తత కుమారుడు జాషువాను హత్య చేసిన కేసులో ఆమె దోషిగా తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా ఇడహోలోని కోర్టు జడ్జి స్టీవెన్ తన తీర్పుని వెల్లడిస్తూ.. ‘‘ఎలాంటి పెరోల్‌కి అనుమతి లేకుండా నీకు జీవితఖైదు శిక్ష విధిస్తున్నాం’’ అని చెప్పారు.

MNREGA: ఉపాధి హామీ పథకంలో వారి భాగస్వామ్యాన్ని పెంచాలంటున్న ఆర్థికవేత్తలు

కాగా.. యేసుక్రీస్తు రెండో రాక కోసం మానవాళిని సిద్ధం చేయడానికి తాను మానవరూపంలో పుట్టిన దేవత అని లోరీ వాల్లో పేర్కొంది. తాను దేవదూతలతోనూ కమ్యూనికేట్ చేయగలదని కోర్టులో చెప్పింది. ఆమె వాదనలు విన్న తర్వాత.. తన హత్యలను సమర్థించుకోవడానికి ఆమె మత విశ్వాసాల్ని కారణంగా చూపుతోందని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆమె నేరాల వెనుక ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అటు.. లోరీ ఐదో భర్త చాడ్ డేబెల్, తన మొదటి భార్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటుండగా, అతడ్ని నిర్దోషిగా తేల్చారు.

Moeen Ali Retirement: రెండోసారి రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌.. ఈసారి మెసేజ్ డిలీటే!

ఇదిలావుండగా.. లోరీ వాలో పిల్లలు 2019లో కనిపించకుండా పోయినప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమ పిల్లలు కనిపించడం లేదని లోరీ, ఆమె భర్త డేబెల్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. ఫైనల్‌గా ఇడహోలో డేబెల్ ప్రాపర్టీలో ఆ ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ పిల్లలతో పాటు ఈ భార్యభర్తలకు సన్నిహితంగా ఉన్నవారు కూడా హత్యకావింపబడ్డారని విచారణలో తేలింది. వారిలో డేబెల్ మొదటి భార్య టామీ కూడా ఉన్నారు. ఈ జంట హవాయికి వెళ్లడానికి కొన్ని వారాల ముందు, 2019 అక్టోబర్‌లో ఆమె మృతి చెందింది.

Twitter X Logo: హెడ్‌క్వార్టర్స్‌పై ‘X’ లోగోని తొలగించిన ట్విటర్.. కారణం ఇదే!

ఒక మోర్మాన్‌ (అంతిమ కాలానికి సిద్ధమవుతున్న శాఖ)లో పెరిగిన వాలో.. కాలక్రమంలో మతవిశ్వాసాల్ని బలంగా నమ్మడం ప్రారంభించింది. 2018లో ఈమె మోర్మాన్ శాఖ నాయకుడు అయిన డేబెల్‌ని కలిసింది. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో.. పెళ్లి చేసుకున్నారు.

Exit mobile version