Site icon NTV Telugu

US: అమెరికా రక్షణ కార్యదర్శి హెగ్సేత్ రాజీనామా! వైట్‌హౌస్ క్లారిటీ

Us

Us

అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్రేత్‌ రాజీనామా చేశారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొత్త కార్యదర్శి కోసం వైట్‌హౌస్ వెతుకులాట ప్రారంభించిందని వార్తలు ప్రకారం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది. హెగ్సేత్ రాజీనామా వార్తలను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. అలాంటిదేమీ లేదని.. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేసింది.

ఇది కూడా చదవండి: Kesineni Nani vs Kesineni Chinni: తన తమ్ముడిని టార్గెట్‌ చేసిన కేశినేని నాని.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు..!

యెమెన్‌పై అమెరికా వైమానిక దాడుల సమాచారాన్ని ముందుగానే లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఇందుకు అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్సేత్‌నే కారణమంటూ అమెరికా మీడియా కోడైకూసింది. సిగ్నల్ యాప్‌లోని సైనిక సమాచారం.. ప్రైవేటు గ్రూప్‌లోకి వెళ్లిపోవడంతో సమాచారం లీకైనట్లుగా గుర్తించారు. అంతేకాకుండా హెగ్సేత్ భార్య కూడా కుటుంబ సభ్యులకు.. వ్యక్తిగత లాయర్‌తో పంచుకున్నట్లు కూడా కథనాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: PSR Anjaneyulu Arrest: ముంబై నటి జత్వానీ కేసు.. సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!

అయితే ఇంత జరిగినా వైట్‌హౌస్ లైట్‌ తీసుకుంది. అత్యంత సున్నితమైన వ్యవహారం బయటకు పొక్కినా.. ట్రంప్ సర్కార్ ఏ మాత్రం చర్యలు చేపట్టలేదు. పైగా హెగ్సేత్‌ను వెనకేసుకొస్తోంది. అయితే డెమోక్రట్లు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. నూతన పాలకవర్గం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్‌ 22, మంగళవారం దినఫలాలు

Exit mobile version